CM Revanth Reddy : శ్రీలీల ఐటమ్ సాంగ్‌ కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదు : సీఎం రేవంత్ రెడ్డి

రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమపై కేటీఆర్ విమర్శలు  సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని చెప్పారు.  శ్రీలీల ఐటమ్ సాంగ్‌ కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు.

New Update
cm revanth reddy

రెండేళ్ల కాంగ్రెస్ పాలనను పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చవద్దన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమపై కేటీఆర్ చేస్తున్న విమర్శలు  సినిమాలో ఐటమ్ సాంగ్ లాగా ఉన్నాయని చెప్పారు.  శ్రీలీల ఐటమ్ సాంగ్‌ కు..కేటీఆర్ ప్రచారానికి తేడా లేదన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకు రక్షణ కల్పిస్తాడా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 

ఈ మీట్ లో సీఎం రేవంత్ మాట్లాడుతూ..  రూ. 8లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పగించారని చెప్పారు. వాళ్ల అప్పులు తీరుస్తూ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రాన్ని పూర్తిగా  దివాళా తీయించారని ఆరోపించారు. కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్, సచివాలయం, ప్రగతి భవన్ లతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. తాము చేసిన పనులు కేసీఆర్ చెరిపేస్తే పోయేవి కాదన్నారు. 

కాంగ్రెస్ ఎంత త్యాగం చేసిందో అందరికీ తెలిసిందన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఏర్పడిందన్నారు. అధికారంలోకి వచ్చిన పదేళ్లలో  బీఆర్ఎస్ అభివృద్ధి చేయడం పక్కన పెట్టి అప్పులు చేసి పోయిందన్నారు. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని,  డబ్బులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 

వందల కోట్లతో అభివృద్ధి

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి జరగలేదని, తమకు ఈసారి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. గత కాంగ్రెస్ పాలన (2004-2014)లో చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు.

Advertisment
తాజా కథనాలు