విద్యార్థుల కోసం కొత్త పథకం..సీఎం రేవంత్ కీలక ప్రకటన!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలోని పర్ఆటక ప్రాంతాలను చారిత్రక కట్టడాలను విద్యార్థులు తెలంగాణ దర్శిని అనే పథకం ద్వారా ఉచితం సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రేవంత్‌ తెలిపారు.

CM REVANTH
New Update

Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరో ఇంట్రెస్టింగ్ ప్రకటన చేశారు. ఈసారి వార్త  విద్యార్థుల కోసం. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల (Students) కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని రేవంత్‌ ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను, చారిత్రక కట్టడాలను విద్యార్థులు ఉచితంగా సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు  రేవంత్ ప్రకటించారు. 

ఇందు కోసం "తెలంగాణ దర్శిని" (Telangana Darshini)  అనే కొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని.. సచివాలయంలో తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల పునరుద్ధణ గురించి సమీక్షలో చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పురాతన కట్టడాలు కాపాడడమే లక్ష్యంగా సీఐఐ(CII) తో రాష్ట్ర పర్యాటక శాఖ ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ క్రమంలో.. పురాతన బావులను దత్తత తీసుకునేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఆసక్తి చూపుతూ ముందుకు వచ్చాయి. ఇకపై పురాతన బావులను ప్రక్షాళన చేసి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సీఎం వారికి ఒప్పంద పత్రాలు అందజేశారు.

ఉస్మానియా యూనివర్సిటీలోని మహాలఖా మెట్ల బావి పునరుద్దరణకు ఇన్పోసిస్ (INFOSYS) సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు గవర్నమెంట్‌ ప్రకటించింది. మంచిరేవుల మెట్ల బావిని సాయి లైఫ్ సంస్థ దత్తత తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, భారత్ బయోటెక్ సంస్థ సాలార్ జంగ్, అమ్మపల్లి బావుల‌ను పునరుద్దరించనుంది. ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఎస్ ఆర్టీసీ(TGSRTC) , రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి ఉమెన్స్ కాలేజీ పునరుద్దరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read: పొంగులేటికి కొడుకు షాక్‌.. రూ.35 కోట్ల విలువైన 7 వాచ్‌లు కొనుగోలు

#telangana #cm-revanth-reddy #Telangana Darshini
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe