Telangana: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌...!

కొత్త రేషన్‌ కార్డుల జారీకి అక్టోబర్‌ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని రేవంత్‌ అన్నారు.

author-image
By Bhavana
New Update

Telangana: కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం అక్టోబర్‌ రెండో తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని రేవంత్‌ అన్నారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం ముఖ్యమంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ వి.శేషాద్రి, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్రిన్సిప‌ల్ కార్యద‌ర్శి డీఎస్‌ చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

డిజిట‌ల్ రేష‌న్ కార్డులు...

అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. అయితే ఈ అంశంపై త్వరలోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వహించాల‌ని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీకి మంత్రివర్గ ఉప సంఘం విధి విధానాలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్​ కార్డులు జారీ చేసేవారు. 

ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని మార్చాలా లేక ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీని పై పౌర సరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాల గురించి తెలియజేశారు.

 పలు రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్లిన బృందం ఒక నివేదికను ఉపసంఘానికి అందించింది. దానిపై చర్చ సాగింది. రాష్ట్రంలో రేషన్​కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్​ జారీపై పలు మార్పులను చేయాలని ప్రభుత్వం చూస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంత వరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్​ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేదా, లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది. ఇలా అన్ని కోణాల్లో సమావేశంలో  తాజాగా చర్చించినట్లు తెలిపింది.

Also Read :  వాటర్ హీటర్ షాక్ కొట్టి వ్యక్తి అక్కడికక్కడే మృతి

#telangana #ts-new-ration-cards #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe