Revanth: మూసీ ఎలా మారనుందంటే.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని సీఎం రేవంత్ అన్నారు. ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలని సదర్ సమ్మేళనంలో కోరారు. సదర్ సమ్మేళనం ఇకపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు.

author-image
By srinivas
New Update
cm revanth

Musi River : ఏ శక్తులు అడ్డొచ్చినా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత తమదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవం కల్పిద్దామని, ఈ నగరం అభివృద్ధి చేయడానికి యాదవ సోదరులు అండగా నిలబడాలంటూ సదర్ సమ్మేళనంలో కోరారు. మూసీ పరివాహక ప్రాంతవాసుల జీవన ప్రమాణాలను మెరుగు పరచబోతున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సదర్ అంటే యావవుల ఖదర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవ సోదరుల పాత్ర కాదనలేనిదని, భాగ్య నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. ఇకపై సదర్ సమ్మేళనం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. నేను ఆనాడే చెప్పా.. ఇక నుంచి ప్రతీ ఏటా సదర్ సమ్మేళనం అధికారికంగా నిర్వహించాలని ఈ వేదిక నుంచి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. సదర్ అంటే యాదవుల ఖదర్.. సదర్ సమ్మేళనాన్ని ప్రతీ గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Maoist: మావోయిస్టులపై ఆఖరి ఆపరేషన్!

రాజకీయాల్లో యాదవులకు సముచిత స్థానం..

యాదవులు రాకీయంగా ఎదగాలని అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపించమని చెప్పారు. రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాదవ సోదరులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో యాదవ సోదరులు పశు సంపదను పెంచి పోషించారని, ఆనాడు మూసీ పరివాహక ప్రాంతాల్లో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునేవారు.

ఇది కూడా చదవండి: Batti Vikramarka: మహిళలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బస్సు యజమానులుగా.. భట్టీ కీలక వ్యాఖ్యలు

అంజన్ అన్నను గెలిపించి ఉంటే..

అలాగే ప్రభుత్వం అందించే అవకాశాలను యాదవ సోదరులు అందిపుచ్చుకోవాలన్నారు. ఆనాడు ముషీరాబాద్ లో అంజన్ అన్నను గెలిపించి ఉంటే.. మీవైపు నుంచి మంత్రిగా నిలబడేవారని ఈ సదర్భంగా గుర్తు చేశారు. అంజన్ అన్న ఓడినా యాదవ సోదరులకు ప్రాధాన్యత ఉండాలని అనిల్ కు రాజ్యసభ ఇచ్చామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడ్డాడు.. అందుకే కురుక్షేత్రంలో అధర్మం ఓడింది.. ధర్మం గెలిచింది. యాదవ సోదరులారా ధర్మం వైపు నిలబడండి.. అధర్మాన్ని ఒడిద్దాం’ అంటూ పిలుపునిచ్చారు. 

ఇది కూడా చదవండి: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా?

ఇది కూడా చదవండి: Iran సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. తర్వాతి వారసుడు ఆయనేనా

Advertisment
Advertisment
తాజా కథనాలు