సూర్యాపేటలో చైన్ లింక్ యాప్ మోసం.. కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు!

సూర్యాపేట జిల్లా కేంద్రంలో చైన్ లీక్ యాప్ మోసం బయటపడింది. కొందరు డబ్బులకు ఆశపడి యాప్ లో పెట్టుబడులు పెట్టారు. తీరా సంస్థ ఎత్తేయడంతో బాధితులు వవిల విల లాడుతూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

cyber scam
New Update

దేశంలో టెక్నాలజీ రోజు రోజుకి ఎంత డెవెలప్ అవుతుందో తెలిసిందే. అయితే ఆ టెక్నాలజీని కొందరు మోసాలకు వినియోగిస్తున్నారు. ఆ మోసాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా డబ్బుల ఆశకు వెళ్లి కొందరు నిండా మునిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రం వేదికగా ఈ మోసం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..

ఓవ్యక్తి  నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ జూలైలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో కార్యాలయా న్ని ప్రారంభించాడు. అది . అమెరికాకు చెందిన సంస్థగా చెబుతూ అక్కడి వాళ్ళను నమ్మించాడు. అందుకు అవగాహన సదస్సులు పెడుతూ బాధి తుల నుంచి రూ.1,800 కట్టించుకోవడమే కాకుండా వారు మరికొంత మందితో డబ్బులు కట్టించేలా జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తులు మధ్యవర్తులుగా నియమించుకున్నాడు.

Also Read : మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఊరు..ట్విస్టులతో సాగిన 'క' ట్రైలర్

వీరి ద్వారా ఈ సంస్థల్లో రూ. 1,800 కట్టి సభ్యత్వం తీసుకుంటే యాప్‌ ఇచ్చి ప్రతిరోజు 4 నుంచి 5 యాడ్‌లను పంపిస్తూ వాటిని చూసిన వారికి ప్రతి రోజు రూ.60లను యాప్‌లో జమ చేస్తుంటారు. ఇలా రూ.1,800లు కడితే రోజుకు రూ.60, రూ. 4, 500 కడితే రూ.260, అలాగే రూ.15 వేలు కడితే రూ.540, అదేవిధంగా రూ.45 వేలు కడితే 1,620, లక్ష 20వేలు కడితే రూ.4,650, ప్రతి రోజు వస్తుంటాయి. 

డబ్బులిస్తూ నమ్మించి..

ఇవేకాకుండా ఒకవ్యక్తి కింద రూ.400 మంది సభ్యులు చేరితే వారికి లక్షరూపాయల వేతనంతో పాటు వారు సమావేశాన్ని పెట్టుకునేందుకు అయ్యే ఖర్చును ఇస్తూ వచ్చారు. ఇలా జమ అయిన డబ్బు వారంలో ఒక రోజు ప్రతి మంగళవారం విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించగా మంగళవారం విత్‌డ్రా కనిపించక పోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంస్థ ఎత్తేశారని తెలియడంతో విలవిల లాడుతున్నారు. 

Also Read : 'లవ్ రెడ్డి' సినిమా నటుడిపై ప్రేక్షకురాలి దాడి.. బండబూతులు తిడుతూ

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల మంది ఉన్న ఆర్‌జీఏ బాధి తులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈవిషయమై సదరు మోటివేటర్‌ను బాధితులు నిల దీయగా తాము కూడా మోసపోయామని చెప్పుకొచ్చారు. దీంతో పోలీసులు  సదరు మధ్యవర్తిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.

 

#crime-news #suryapet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe