TG DSC Certificate Verification : తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని తెలియజేశారు. సీఎం ప్రకటించిన ప్రకటన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్‌గా పని చేస్తోంది.
అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అధికారులు నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా అధికారులు అభ్యర్థులకు సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఫలితాలను సోమవారం ప్రకటించారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో కేవలం 7,000 పోస్టులే భర్తీ చేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు, అయితే తమ ప్రభుత్వం కేవలం 10 నెలలలో 11,062 పోస్టులను భర్తీ చేస్తూ 56 రోజుల్లో ఫలితాలు విడుదల చేసింది. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని అధికారులు తెలియజేశారు.
తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 65,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో గ్రూప్-1 ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Also Read: ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ !