నేటి నుంచి ఒంటి పూట బడులు

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లు ఒంటి పూట పనిచేయనున్నాయి. సర్కార్ చేపడ్తున్న సర్వేలో టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రైమరీ స్కూళ్లు నడవనున్నాయి.

New Update
Telangana: రేపటి నుంచే తెలంగాణలో బడులు ప్రారంభం

Half Day Schools: ఈరోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లు ఒంటి పూట నడవనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కులగణన చేపట్టేందుకు గవర్నమెంట్, ఎయిడెడ్ ప్రైమరీ స్కూళ్లలోని ఎస్జీటీలు, నాన్ టీచింగ్ స్టాఫ్​కు డ్యూటీలు అప్పగించారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రైమరీ స్కూళ్ళు పని చేయనున్నారు. 

Also Read :  'బాధ కూడా ఉంది..' ఆ విషయంలో తప్పు చేశా.. సమంత ఎమోషనల్

మధ్యాహ్నం భోజనం తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్లనున్నారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం వరకు స్కూల్ పని వేళలో పిల్లలకు పాఠాలు చెప్పి.. మధ్యాహ్నం నుంచి సర్వేకు టీచర్లు వెళ్లాల్సి ఉంటుంది. అలాగే సర్వే డ్యూటీ పడని టీచర్లు సాయంత్రం వరకు స్కూల్లోనే ఉండాలని సూచిస్తూ ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read :  తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే!

85 వేల మంది...

ఈ సర్వేలో మొత్తం  85 వేల మంది ఎన్యుమరేటర్లు పాల్గొంటున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి పంపిచేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 20 వేలకు పైగా ఉన్న ప్రైమరీ స్కూళ్లలో పనిచేసే సుమారు 50వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉపాధ్యాయులను సర్వేలో పాల్గొననున్నారు. వీరిలో 36,559 మంది ఎస్జీటీలు, 3,414 పీఎస్ హెచ్​ఎంలు, ఎంఈవో ఆఫీసుల్లో పని చేసే 6,256 మంది సిబ్బంది, 2వేల మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. 

Also Read : కొత్త రేషన్ కార్డులపై మంత్రి కీలక ప్రకటన!

సర్వే నుంచి మినహాయింపు ఉన్న ఉపాధ్యాయులందరూ స్కూల్స్​లోనే ఉండాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. సర్వేలో టీచర్లు పాల్గొనని అన్ని స్కూల్స్.. రెగ్యులర్ టైమ్సింగ్ పాటించాలని అధికారులు సూచించారు. 30 రోజుల్లోగా ఈ సర్వే పూర్తి కావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సర్వే ఆధారంగానే స్థానిక సంస్థల ఎన్నికకు వెళ్లాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు.

Also Read : ఈ నెల 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు