స్మశానంలో అఘోరీ రక్తపాతం.. కేసు నమోదు, 5ఏళ్లు జైలు శిక్ష!

వరంగల్‌లోని మామునూర్ పోలీస్ స్టేషన్‌లో అఘోరీపై కేసు నమోదు అయింది. రెండు రోజులు స్మశానంలోనే విచిత్ర పూజలు చేసి కోడిని బలిచ్చింది. దీంతో లా విద్యార్థులు కసిరెడ్డి రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్‌లు వరంగల్‌లోని మామునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

New Update
Aghori (2),

లేడీ అఘోరి గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. తన వికృత చేష్టలతో అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవాలంటూ రోడ్డుపై బైఠాయించింది. అడ్డొచ్చిన పోలీసులపై విరుచుకు పడింది. 

ఆ తర్వాత గుజరాత్‌కు పయణమైంది. ఈ క్రమంలోనే అఘోరి చిక్కుల్లో ఇరుక్కుంది. తాజాగా వరంగల్‌లో అఘోరీపై కేసు నమోదు అయింది. వరంగల్‌లోని నగర శివారులో బెస్తం చెరువు స్మశాన వాటికలో అఘోరి పూజలు చేసింది. 

Also Read: అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ .. ప్రకటించిన నాగార్జున

అఘోరీపై కేసు నమోదు

దాదాపు రెండు రోజులు స్మశానంలోనే విడిది చేసి విచిత్ర పూజలు చేసింది. అందులో భాగంగానే కోడిని బలిచ్చింది. దీంతో అది చూసిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయంపై కరీంనగర్ జిల్లాకు చెందిన లా విద్యార్థులు కసిరెడ్డి రోహన్ రెడ్డి, సౌమిత్ పటేల్‌లు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని మామునూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Also Read: RGVకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు..

ఆ ఫిర్యాదులో.. బహిరంగంగా కోడిని బలివ్వడం నేరమని.. దీనిపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీంతో పోలీసులు అఘోరీపై కేసు నమోదు చేశారు. 325 BNS, 11(1)(A) PCAA కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం అఘోరీ గుజరాత్ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

5ఏళ్లు జైలు శిక్ష?

దీనిపై పిటిషనర్ రోహన్ రెడ్డి మాట్లాడారు. అఘోరికి పోలీసులు ఎఫ్ఐఆర్ అందజేయడంతో పాటు బెయిల్ కూడా మంజూరు చేయరని ఆయన తెలిపారు. అంతేకాకుండా 2 నెలల్లోపు ఛార్జ్ షీట్ నమోదు చేస్తారని అన్నారు. ఇందులో భాగంగానే కేసు నిరూపణ అయితే అఘోరీకి ఒక్క రోజు నుంచి దాదాపు 5 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Also Read: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన స్టార్ ఆటగాళ్లు

ఏపీలో పలు ఆలయాలు సందర్శన

అఘోరీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ఆలయాల వద్ద రచ్చ రచ్చ చేస్తుంది. నగ్నంగా ఉండడంతో ఆలయంలో దర్శనానికి అఘోరిని అనుమతించట్లేదు. దీంతో ఆమె ఆలయాల బటయ హల్ చల్ చేస్తున్న వీడియోలు ఇప్పటికే బాగా వైరల్ అయ్యాయి.

Also Read: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!

ఇక ఇటీవలే మంగళగిరిలో నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసింది. ఆమెను అదుపుచేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. ఏకంగా పోలీసుల పైనే చేయి చేసుకుంది. దీంతో ఇక లాభం లేదని భావించిన పోలీసులు ఆమెను పట్టుకుని ఒక వ్యాన్ ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల్లో విడిచిపెట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు