తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుంతునేదానిపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. మంత్రిత్వ శాఖల్లో మళ్లీ ఒకటి లేదా రెండు ఖాళీ ఉంచుతారని కూడా తెలుస్తోంది.
Also read: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే!
వాకిటి శ్రీహరి ముదిరాద్, పి.సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్‌లకు మంత్రి పదవులు దాదాపు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆశావాహుల్లో మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు మైనార్టీలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వడంపై ఆలోచిస్తున్నారు. అయితే తెరపైకి షబ్బీర్ అలీ, అజారుద్దీన్ పేర్లు వస్తున్నాయి.