/rtv/media/media_files/2025/11/07/brs-party-2025-11-07-10-32-01.jpg)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఉదయం నుండి ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తూ వరుస విజయాలను నమోదు చేస్తున్నారు. 12వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించి, పార్టీకి బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. హోరాహోరీగా సాగిన పోరులో 11వ వార్డును కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వరుసగా రెండు వార్డుల్లో విజయం సాధించడంతో బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. 4వ వార్డులో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు.
కాగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపు 68-76 మున్సిపాలిటీలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిస్తోంది. సుమారు 29-36 మున్సిపాలిటీల్లో ఈ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.
Follow Us