/rtv/media/media_files/2025/05/23/WnLUOc7K42j7Fjvbi6SN.jpg)
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు తాను లేఖ రాసింది నిజమేనని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను రెండు వారాల క్రితమే ఆ లేఖ రాశానని తెలిపారు. పార్టీలో ఎవరో కుట్ర చేసి ఆ లేఖను లీక్ చేశారని కవిత తెలిపారు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక మాత్రం కుట్ర ఉందన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కవిత అనంతర మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ దేవుడన్న కవిత.. ఆయన పక్కన కొన్ని దెయ్యాలు ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. అలాంటి వాళ్ల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని చెప్పారు. లేఖలో కార్యకర్తల అభిప్రాయలే వెల్లడించానని.. తన వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదన్నారు కవిత.
కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి @RaoKavitha
— Sateesh Vinjam (@Sateesh_Vinjam) May 23, 2025
రెండు వారాల క్రితం తానే కేసీఆర్ కి లేఖ రాశానని BRS MLC కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. 'నాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉంది. pic.twitter.com/tEyIECdHdt
ప్రతిసారీ లేఖలు రాస్తా
తనకు ఎలాంటి పర్సనల్ అజెండా లేదని వెల్లడించారు. కేసీఆర్‌కు ప్రతిసారీ లేఖలు రాస్తానని చెప్పిన కవిత.. కానీ ఇప్పుడు బయటకు రావడం బాధాకరమని తెలిపారు. పార్టీలోని వ్యక్తులే లెటర్ లీక్ చేశారని ఆరోపించారు. పార్టీలోని కొందరు కోవర్టులే- పనేనన్నారు. కేసీఆరే తమ నాయకుడని ఆయన నాయకత్వంలోనే పని చేస్తామని కవిత తెలిపారు. పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్ ఉంటుందని తన అభిప్రాయంగా కవిత చెప్పుకొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణను ఫెయిల్ చేశాయని విమర్శించారు. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆర్ నాయకత్వమే-ని తెలిపారు. కుటుంబం, పార్టీ రెండు ఐక్యంగానే ఉన్నాయని తెలిపిన కవిత.. తమ నాయకుడు కేసీఆరే.. తనకు ఎలాంటి ఇతర ఆలోచన లేదని స్పష్టం చేశారు.