BIG BREAKING: రేవ్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ?

ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతాల్లో విచ్చల విడిగా సాగుతోన్న రేవ్‌ పార్టీల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో ఓ ఫాంహౌస్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

New Update
BRS MLC at Rave Party?

BRS MLC at Rave Party?

Hyderabad Rave Party :  నగరంలో రేవ్‌ పార్టీల కల్చర్‌ రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ సరిహద్దు ప్రాంతాల్లో విచ్చల విడిగా సాగుతోన్న రేవ్‌ పార్టీల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళవారం మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో   జరుగుతున్న రేవ్‌ పార్టీని ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు భగ్నం చేసిన విషయం మరిచిపోకముందే మరో పార్టీ వెలుగు చూసింది.

రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో  మరో రేవ్ పార్టీ కలకలం రేపింది. లింగంపల్లి గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో అర్థరాత్రి  రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫాం హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న రేవ్‌పార్టీని భగ్నం చేశారు. రేవ్‌పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా రేవ్​ పార్టీ నిర్వహిస్తు్న్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు.  ఈ సందర్బంగా 2 లక్షల 40 వేల నగదు, 15 మొబైల్ ఫోన్లు, 11 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని మంచాల పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

కాగా పట్టుబడ్డ వాహనాల్లో  బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కి సంబంధించిన రెండు కార్లు ఉన్నట్లు సమాచారం. అయితే సదరు ఎమ్మెల్సీ స్టీకర్ ఉన్న వాహనాలను పోలీసులు కనపడకుండా దాచేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఆ వాహనంపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన స్టిక్కర్లు, వాహనాల లోపల పార్టీ కండువాలు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్టిక్కర్ కనిపించకుండా దానిపై వైట్ పేపర్‌ను పోలీసులు అతికించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినవస్తు్న్నాయి. అయితే ఆ ఎమ్మెల్సీ కారును సదరు ఎమ్మెల్సీకి సంబంధించిన వ్యక్తులు తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. మరికొందరేమో ఎమ్మెల్సీకి డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి పార్టీకి వచ్చి ఇరుక్కుపోయినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై సదరు ఎమ్మెల్సీ స్పందిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

కాగా ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ పరిసరాల్లో తరచూ రేవ్ పార్టీ ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మహేశ్వరం పరిధి గట్టుపల్లి శివారులోని కోర్పోలు చంద్రారెడ్డి రిసార్టులో మరో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే.అర్థరాత్రి జరుగుతున్న రేవ్‌ పార్టీపై ఎస్‌వోటీ బృందం, మహేశ్వరం పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీనిలో 72 మంది పోలీసుల అదుపులో ఉన్నారు.  దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. గాజుల రామారానికి చెందిన తిరుపతిరెడ్డి, రాక్‌ స్టార్‌ ఫెర్టిలైజర్స్‌ సైదారెడ్డి వివిధ ప్రాంతాలకు చెందిన డీలర్స్‌తో రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇది కూడా చూడండి: Car fire accident : ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం (వీడియో)

Advertisment
తాజా కథనాలు