BIG BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు సీరియస్!

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

New Update
Maganti Gopinath

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆయన అభిమానులు, కార్యకర్తలు సైతం భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. 

1983లో టీడీపీతో మాగంటి రాజకీయాల్లోకి వచ్చారు. 1985 - 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1987, 1988లో హుడా డైరెక్టర్‌గా పని చేశారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 23లో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం BRS హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

కిడ్నీ సమస్య?

ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన అనారోగ్యానికి గురై బాధపతున్నట్లు వార్తలు వచ్చాయి. కిడ్ని వ్యాధిని నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి సీరియస్ గా మారిందని సమాచారం. ఫిబ్రవరిలోనూ ఓ సారి తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అనంతరం పరిస్థితి కాస్త కుదుటపడినా.. ఇప్పుడు మళ్లీ విషమించింది. 

Advertisment
తాజా కథనాలు