MLA KTR : తెలంగాణలో రేవంత్ సర్కార్ పై మరోసారి ట్విట్టర్ (X) వేదికగా నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్. రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు రూ.80,500 కోట్లు అని అన్నారు. తెలంగాణలో 10నెలల్లో ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఇదే తొలిసారి రికార్డ్ అని ఆయన పేర్కొన్నారు. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి? అని చురకలు అంటించారు.
ఇది కూడా చదవండి: విషాదం.. గుండెపోటుతో ఐదేళ్ల చిన్నారి మృతి!
దేనితో కొట్టాలి రేవంత్?
సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల దాడికి దిగారు కేటీఆర్. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిన తెలంగాణను నిలువునా ముంచిందని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు దేనితో కొట్టాలని అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలేవీ తీర్చలేదని అన్నారు. ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదు అని చెప్పారు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు? అని ప్రశ్నించారు. రూ.80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? అని అడిగారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా? అని అన్నారు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? అని అన్నారు.
Also Read : నేడు కోర్టుకు సీఎం రేవంత్!
ఇది కూడా చదవండి: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే
మేము కష్టాలు తీర్చాము...
బీఆర్ఎస్ హయాంలో అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టినట్లు చెప్పారు కేటీఆర్. ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచామన్నారు. తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చమన్నారు. కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల "అడ్రస్" ఎక్కడ? అని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా.. రైతుభరోసా వేయకుండా.., ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా.. నెలలపాటు జీతాలు ఇవ్వకుండా.. ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు? అని నిలదీశారు. రాష్ట్ర సంపద సృష్టికి కాకుండా సొంత ఆస్తులు పెంచుకోవడానికి అప్పులు చేయడం క్షమించరాని నేరం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు పెను ప్రమాదం అని అన్నారు.
ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!