/rtv/media/media_files/2025/11/14/brs-leads-2025-11-14-10-08-14.jpeg)
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటివరకు మూడు రౌండ్ల ఓట్లు వెలువడ్డాయి. మూడో రౌండ్‌లో బీఆర్ఎస్‌కు 12503 ఓట్లు పోలైయ్యాయి. కాంగ్రెస్‌కు 12292 ఓట్లు వచ్చాయి. దీంతో బీఆర్ఎస్ మూడో రౌండ్‌లో 211ఓట్లు లీడ్ వచ్చింది. మూడో రౌండ్‌లో రహమత్ నగర్, వెంగళ్‌రావు నగర్ ఓట్లను లెక్కించారు. మొత్తం మూడు రౌండ్లు కలిపి చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు.
యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. నాలుగో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో నోటాకు 99 ఓట్లు పడినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తర్వాత నాల్గొ స్థానంలో నోటానే ఉండటం ఆశ్చర్యం.
Follow Us