BREAKING: తెలంగాణకు బిగ్ షాక్.. బనకచర్లకు CWC అనుమతులు.. సాక్ష్యాలు బయటపెట్టిన హరీశ్ రావు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై హరీష్ రావు ఫైర్ అయ్యారు.

New Update
Screenshot 2025-12-30 174935

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్ట్ బనకరచ్ల మరోసారి చర్చనీయాంశమైంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం నుండి అనుమతులు రావడంపై తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. దీనిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 'మొద్దు నిద్ర' వీడాలని, లేదంటే తెలంగాణ జల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు.

CWC అనుమతులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ నుంచి కీలక అనుమతులు రావడం తెలంగాణకు తీవ్ర అన్యాయమని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండానే కేంద్రం ఈ అనుమతులు ఇవ్వడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం కనీసం కోర్టును ఆశ్రయించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "ప్రభుత్వానికి ఈ అనుమతులు కనిపించడం లేదా? లేక పడుకున్నట్లు నటిస్తున్నారా?" అని ప్రశ్నించారు.

ఆదిత్యనాథ్ దాస్ తొలగింపు డిమాండ్

తెలంగాణ జల ప్రయోజనాల రక్షణ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, దీనికి ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ సూత్రధారి అని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. "కత్తి ఆంధ్రా వాళ్ళది, పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డే" అంటూ పదునైన విమర్శలు చేశారు. తెలంగాణ జలదోపిడీకి సహకరిస్తున్న ఆదిత్యనాథ్ దాస్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 'గురువుకు గురుదక్షిణ' ఇస్తూ తెలంగాణ నీటిని ఆంధ్రాకు ధారపోస్తున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో ధర్నాకు పిలుపు

ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పోరాట పంథా ప్రకటించింది. బనకచర్ల అనుమతులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని, దీనికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని హరీష్ రావు ప్రకటించారు. సీడబ్ల్యూసీ అనుమతుల రద్దు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో భారీ ధర్నా చేపడదామని ప్రభుత్వానికి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకువెళ్లాలని సూచించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు రావలసిన గోదావరి మిగులు జలాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇది రాష్ట్ర రైతులకు చేసే వెన్నుపోటు అని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ప్రజలే రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు