TG Politics: మంత్రి కోమటిరెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డితో భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. అయితే.. సుధీర్ రెడ్డి పార్టీ మారుతున్నారా? అని కోమటిరెడ్డిని అడగగా.. అది తన పని కాదంటూ బదులిచ్చారు. సుధీర్ రెడ్డి తన బంధువన్నారు.

New Update
MLA Sudheer Reddy Minister Komatireddy

MLA Sudheer Reddy Minister Komatireddy

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. నియోజకవర్గంలో పెండింగ్ పనుల విషయంలోనే మంత్రిని కలిశానని సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ విషయంపై వెంకట్ రెడ్డి సైతం స్పందించారు. సుధీర్ రెడ్డి తనకు బంధువు అవుతాడన్నారు. తనకు వరుసకు అల్లుడు అవుతాడని వివరించారు. కాంగ్రెస్ పార్టీ లోకి సుధీర్ రెడ్డిని తీసుకొస్తున్నరా? అని విలేకరులు ప్రశ్నించగా.. అది తన పని కాదంటూ బదులిచ్చారు. 

రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై రియాక్షన్..

తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అంశంపై సైతం కోమటిరెడ్డి స్పందించారు. కేబినెట్ విస్తరణ, మంత్రి పదవుల కేటాయింపుపై తనకు సమాచారం లేదని స్పష్టం చేశారు. మంత్రుల విషయంలో తనను ఎవరు సంప్రదించలేదని స్పష్టం చేశారు. పేపర్, టీవీల్లో చూడటమే తప్పా.. సమాచారం లేదన్నారు. 

సుధీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన సుధీర్ రెడ్డి.. 2018లో ఆ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన మళ్లీ తన సొంత గూటికి చేరుతారన్న చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. తాజాగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కావడంతో మరో సారి సుధీర్ రెడ్డి పార్టీ మార్పు అంశం చర్చకు వచ్చింది.

(komatireddy-venkatreddy | telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు