Asaduddin Owaisi : బీఆర్ఎస్‌ కిందస్థాయికి పడి పోయిన పార్టీ..AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మద్దతు తెలిపిన నవీన్ యాదవ్ ను గెలిపించినందుకు AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఓవైసీ..జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో BRS కింద స్థాయికి పడిపోయిన పార్టీ అని ఆయన విమర్శించారు.

New Update
Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. విజయం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఈ ఎన్నికల్లో తమకు సహకరించిన ఎంఐఎం (AIMIM) పార్టీకి, ఓవైసీ బ్రదర్స్‌కు (అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ) ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా నవీన్‌ యాదవ్‌ విజయం పై స్పందించిన  AIMIM అధ్యక్షుడు, MP అసదుద్దీన్ ఓవైసీ..మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము మద్దతు తెలిపిన నవీన్ యాదవ్ ను గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే  బీహార్ లోనూ మా పార్టీ అభ్యర్డులను 5 సీట్లలో గెలిపించారు...బీహార్ ప్రజలకు ధన్యవాదాలు అన్నారు.

RJD, బీజేపీని అడ్డుకోలేదు..అని నేను ముందే చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తాను..ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు..BRS కింద స్థాయికి పడిపోయిన పార్టీ అని ఆయన విమర్శించారు. నేను మా పార్టీ ని మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నామన్నారు. నన్ను తిడితే.. విమర్శిస్తే వారికి పార్టీ లో బలం పెరుగుతుంది అనుకుంటున్నారన్నారు. అజరుద్దీన్ కోపం.. అసదుద్దీన్ పై తీస్తున్నారని ఎద్దేవా తీశారు. తెలంగాణ, జూబ్లీహిల్స్ లలో మరింత అభివృద్ధి చేసేందుకు మా మద్దతు ఉంటుందని ఓవైసీ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు