Jubilee Hills By Poll 2025: జూబ్లీహిల్స్లో ఓటేసిన మాగంటి సునీత

బీఆర్ఎస్ అభ్యర్థి  మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడ లోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు  సునీత. ఆమె కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు.

New Update
maganti sunitha

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం అయింది. ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. చలి చంపేస్తున్న ఓటు వేయడానికి ఉత్సహంగా వస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి  మాగంటి సునీత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎల్లారెడ్డి గూడ లోని నవోదయ కాలనీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు  సునీత. ఆమె కుమారుడు, కూతురు కూడా ఓటు వేశారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

58 మంది అభ్యర్థులు బరిలో

ఓటు హక్కు వినియోగించుకోనున్న 4,01,365 ఓటర్లు ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్‌ బీఆర్ఎస్ నుంచి సునీత,బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీలో ఉన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విధుల్లో 5 వేల మంది సిబ్బంది ఉన్నారు. పోలింగ్‌కు 1,761 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. 800 మంది కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంది. తొలిసారిగా ఎన్నికల నిర్వహణలో డ్రోన్ల ఉపయోగిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు