BIG BREAKING: బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ .. అందరు చూస్తుండగానే..-VIDEO

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 1వ వార్డులో విజయం సాధించిన అభ్యర్థిని పట్టపగలే కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారనే వార్త స్థానికంగా కలకలం రేపుతోంది.

New Update
brs

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 1వ వార్డులో విజయం సాధించిన అభ్యర్థిని పట్టపగలే కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారనే వార్త స్థానికంగా కలకలం రేపుతోంది. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ వినోద్, రెబెల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ గుర్తుపై బరిలోకి దిగారు. నేడు వెలువడిన ఫలితాల్లో ఆయన ఘన విజయం సాధించారు. అయితే, ఫలితం వెలువడిన వెంటనే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నాయకులు, వినోద్‌ను బలవంతంగా ఒక ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన బలాన్ని కూడగట్టుకునే క్రమంలోనే ఈ కిడ్నాప్ జరిగిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గెలిచిన తమ అభ్యర్థిని అధికార పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేసి, తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని మండిపడుతున్నారు

Advertisment
తాజా కథనాలు