/rtv/media/media_files/2025/11/07/brs-party-2025-11-07-10-32-01.jpg)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్​మొదలైంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ కౌంటింగ్ ఏజెంట్లకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్,​హరీశ్ రావు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ ​ప్రక్రియపై తెలంగాణ భవన్​లో గురువారం కౌంటింగ్​ ఏజెంట్లు, కేడర్​తో కీలక సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు.ఏ మాత్రం అనుమానం అనిపించిన ఒకటికి రెండు సార్లు మళ్లీ ఓట్లు లెక్కించేలా కౌంటింగ్​అధికారులకు ఏజెంట్లు విజ్ఞప్తి చేయాలని సూచించారు. ఇక పోలింగ్​ సమయంలో కాంగ్రెస్​ ప్రభుత్వం, ఆ పార్టీ అన్ని రకాల అక్రమాలకు పాల్పడిందని కేటీఆర్, హరీశ్​ రావు ఆరోపించారు. కౌంటింగ్​లోనూ కాంగ్రెస్​ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని ఏజెంట్లకు సూచించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో మొదలైంది. లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. కాంగ్రెస్ కు 39, బీఆర్ఎస్ 36, బీజేపీ 10 ఓట్లతో ఉన్నాయి. EVM లలోని ఓట్ల లెక్కింపు మొదలైంది.ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి ట్రెండ్‌లు ఉదయం 10 గంటలకల్లా, తుది ఫలితం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.
Follow Us