/rtv/media/media_files/2025/11/16/armoor-2025-11-16-11-01-47.jpg)
ఇటీవల వెలువడిన జుబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయేంతటి భారీ ఓటమి చవిచూశారు. ఆ పార్టీ అభ్యర్థి లంకెల దీపక్ రెడ్డికి కేవలం 17,056ఓట్లు మాత్రమే లభించాయి. తద్వారా ఆయన మూడవ స్థానానికే పరిమితం కావడమే కాకుండా, డిపాజిట్‌ను కూడా కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
గత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దీపక్ రెడ్డిని మళ్లీ నిలబెట్టడంపై పార్టీలో అంతర్గతంగా విమర్శలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలపై దీపక్ రెడ్డి స్పందిస్తూ..‘ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది. డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాం. బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు.ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొన్నారు. చీరలు పంపిణీ చేశారు. బహుమతులు ఇచ్చారు. అధికార దుర్వినియోగం చేశారు. అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పైడి రాకేష్ రెడ్డి సంచలన ట్వీట్
ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఓడిపోయాం అంతే చచ్చిపోలేదు.. బీజేపీకి ఓటు వేసిన 17,056మంది కట్టర్ హిందువులకు ధన్యవాదాలు అని తెలిపారు.కనీసం మీరైనా హిందువులుగా బ్రతికి ఉన్నందుకు గర్వపడుతున్నా అంటూ పైడి రాకేష్ రెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
— Paidi Rakesh Reddy MLA (@MLA_RakeshReddy) November 15, 2025
Follow Us