PCC chief Mahesh Goud : బీజేపీపై వరుసగా విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళని సంచలన విమర్శలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించబోతున్న సందర్భంగా సెప్టెంబర్ 15న కామారెడ్డిలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు.దీనికోసం ఆదివారం (సెప్టెంబర్ 7) కామారెడ్డిలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి గడ్డ నుంచి కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ఇచ్చిందని.. మాట ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చాక కుల గణన సర్వే చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నామన్నారు.
బీసీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని మహేష్‌కుమార్ అన్నారు.. రేవంత్ బీసీ వర్గానికి చెందకున్నా బీసీల సంక్షేమం కోసం డిక్లరేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బాగోతం బయటపెట్టడానికే లక్షలాది మందితో కామారెడ్డి లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామన్నారు.
ఇచ్చిన మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మహేష్‌గౌడ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మూడు బిల్లులను కేంద్రానికి పంపించామని తెలిపారు. కానీ కేంద్రంలోని బీజేపీ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ధ్వజమెత్తారు. బీసీ అని చెప్పుకునే బండి సంజయ్ ఓ దేశ్ ముఖ్లాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బండి సంజయ్‌కు దమ్ముంటే పోలీసుల రక్షణ లేకుండా తిరగాలని సవాల్ విసిరారు. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ బీసీల గురించి మాట్లాడటం లేదని.. మీకు చిత్తశుద్ధి, బీసీలపై ప్రేమ ఉంటే బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల బట్టలు ఊడదీసేందుకే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డిలో 15న విజయోత్సవ సభ నిర్వహించబోతున్నామన్నారు. కామారెడ్డి విజయోత్సవ సభ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖరావం పూరించబోతున్నామన్నారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై కూడా విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ దొంగల ముఠా అని విమర్శించారు. దేశంలో అత్యంత తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని గత ఎన్నికల సమయంలోనే చెప్పానని మహేశ్ కుమార్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బిడ్డగా కవితను ఆదరిస్తాం కానీ లిక్కర్ రాణిగా ఒప్పుకోమని స్పష్టం చేశారు. వాటాల విషయంలో తేడాలు రావడం వల్లే కవిత బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఆమె ఈ విషయాలు ఐదేళ్ల క్రితం చెప్పి ఉంటే ప్రజలు నమ్మే వారని.. ఇప్పుడు ఆమెను నమ్మే పరిస్థితి లేదన్నారు.
Also Read : khalistan: ఖలిస్తానీ ఉగ్ర గ్రూపులకు తమ నుంచే నిధులు..అంగీకరించిన కెనడా
PCC chief Mahesh Goud : దేవుడి పేరుతో ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ నాయకులు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు
బీజేపీపై వరుసగా విమర్శలు చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్ళని సంచలన విమర్శలు చేశారు. సెప్టెంబర్ 15న కామారెడ్డిలో విజయోత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు.
PCC chief Mahesh Goud