/rtv/media/media_files/2025/12/26/fotojet-12-2025-12-26-18-20-35.jpg)
BJP chief warns leaders against suspension if party's reputation is tarnished
BJP : క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోనూ ఘర్షనలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఏకంగా పార్టీ కార్యాలయాల్లోనే నాయకులు ఫైటింగ్‌లకు దిగుతుండటంతో అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ బీసీ నేతలు తన్నుకున్న ఘటన మరవకముందే తాజాగా నల్గొండ జిల్లా ఆఫీస్ లో నేతల మధ్య గొడవ జరిగింది. కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం వేదికగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు పిల్లి రామరాజు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు చివరకు బాహాబాహీకి దారితీశాయి. కాగా ఈ గొడవపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా ముందు ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకోవడం తో జిల్లా నేతలకు రాష్ట్ర అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు.ఈ గొడవపై ఇరు వర్గాల వివరణ కోరారు. పార్టీ పరువు బజారుకీడిస్తే సస్పెన్షన్ కు వెనకడం అంటూ రాష్ర్ట కమలం రథ సారథి రాంచంద్రరావు సీరియస్‌గా హెచ్చరించారు. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడులు చేసుకోవడంతో పాటు వీడియో లు తీసిన మీడియా పై దురుసుగా ప్రవర్తించడంతో రామచంద్రరావు ఫైర్ అయ్యారు. నేతలపై చర్యలకు సిద్ధమయ్యారు.
అసలేం జరిగిందంటే..
నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో గురువారం నాయకులు ఘర్షణకు దిగారు. కొత్తగా గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, సీనియర్ నాయకుడు పిల్లి రామరాజు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో బాహాబాహీకి దారితీశాయి. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీ నేతలు ఇలా కొట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
కార్యక్రమం జరుగుతుండగానే ఒకరినొకరు నెట్టుకుంటూ, పిడిగుద్దులు కురిపించుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలో నాగం వర్షిత్ రెడ్డి అనుచరుడు ఒకరు తన మొహంపై గుద్దాడని.. ఆ వ్యక్తితో తన కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించాలని రామరాజు అనుచరుడు డిమాండ్ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. కాగా పిల్లి రామరాజు వర్గీయులు జిల్లా అధ్యక్షుడి తీరుపై విరుచుకుపడ్డారు. ‘వానికి దమ్ముంటే 6వ వార్డులో గెలిచి చూపించమని చెప్పు’ అంటూ వర్షిత్ రెడ్డిని ఉద్దేశించి బహిరంగంగానే సవాల్ విసిరారు. సొంత పార్టీ కార్యాలయంలోనే కొత్తగా గెలిచిన ప్రజాప్రతినిధుల ముందే ఇలాంటి అసభ్యకర ప్రవర్తన చూసి సర్పంచులు విస్మయానికి గురయ్యారు.ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణంతో ఆ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్ల కెమెరాలను కొందరు నేతలు లాక్కుని డేటాను డిలీట్ చేశారు. దీనిపై జర్నలిస్టులు బీజేపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
Follow Us