Bird Flu : హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం...శాంపిల్స్‌లో షాకింగ్‌న్యూస్‌

హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నగర శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్దారణ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. అక్కడి ఓ పౌల్ట్రీ ఫాం లో వేలకోళ్లు చనిపోయాయి.

New Update
Bird Flu Outbreak In Telangana, Wanaparthy 4000 Chickens Died at Poultry

Bird Flu Outbreak In Telangana

 Bird Flu :  హైదరాబాద్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. నగర శివార్లలోని ఓ పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ వైరస్ నిర్దారణ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ నిర్దారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. గత నాలుగు రోజులుగా అక్కడి ఓ పౌల్ట్రీ ఫాం లో వేల కోళ్లు చనిపోగా... అధికారులు శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు. కాగా నేడు అది బర్డ్ ఫ్లూ అని తేలడంతో పౌల్ట్రీ ఫామ్స్ యజమానులు తలలు పట్టుకున్నారు. ఎండల వల్ల కోళ్లు చనిపోయాయనుకున్న వారు కల్లింగ్ ప్రాసెస్ కూడా సరిగా చేయలేదని భయం వ్యక్తం చేశారు. దీంతో పౌల్ట్రీలో పనిచేస్తున్న వారందరి శాంపిల్స్ సేకరించే పనిలో పడ్డారు వైద్యాధికారులు.దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. 

ఇది కూడా చదవండి:Naxalites : మావోయిస్టులకు బిగ్ షాక్.. లొంగిపోయిన 50 మంది నక్సలైట్లు!

ఈ వార్త బయటికి రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా భయంతో వణికి పోతున్నారు. కాగా ఆ ఏరియాను రెడ్ జోన్  గా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి, దోతిగూడెంలోని 3 పౌల్ట్రీ ఫామ్స్ లో బర్డ్ ఫ్లూ సోకినట్టు అధికారులు గుర్తించారు. ఆయా ఫామ్స్ లో ఉన్న కోళ్లను జాగ్రత్తగా పూడ్చి పెట్టించిన అధికారులు.. ఆ ఏరియాలో 5 కిమీల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు.

Also Read: మూడు రోజుల తరువాత భూకంప శిథిలాల కింద నుంచి సజీవంగా..!


పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా టైప్‌ –ఏ వైరస్‌లు వ్యాధి కారకాలు. కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్‌లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్‌’’, ‘‘ఎన్‌’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ.

Also Read: Minor boy accident: 15ఏళ్ల బాలుడు కారు డ్రైవింగ్.. 2ఏళ్ల చిన్నారి మృతి

మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్‌5, హెచ్‌7, హెచ్‌9 రకాల వైరస్‌లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్‌ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్‌లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.ఈ వ్యాధి వస్తే జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు.

Also Read: Allu Arjun: ఇకపై మారనున్న అల్లు అర్జున్ పేరు? కొత్త పేరు ఏంటంటే


కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది.

Also Read : హనుమంతుడి ఈ 4 మంత్రాలు పఠిస్తే.. మీ కష్టాలన్నీ పరార్!

Advertisment
తాజా కథనాలు