/rtv/media/media_files/2025/07/26/ponguleti-2025-07-26-18-49-55.jpg)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకున్నప్పటికీ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఆయన స్వయంగా రంగంలోకి దిగి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చోట ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు పైచేయి సాధించాయి.
కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ - సిపిఐ పొత్తు కుదరకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బగా మారింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న కొత్తగూడెం కార్పొరేషన్లో సీపీఐ మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో విజయం సాధించి ముందంజలో ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ 21 డివిజన్లను కైవసం చేసుకోగా, బీఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొంది కింగ్ మేకర్‌గా మారింది.
మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి చేసిన ప్రచారం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 10 వార్డులను కైవసం చేసుకుని ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంచుకోటగా భావించే తొర్రూరులో పొంగులేటి సభలు నిర్వహించినా, ఓటర్లు మాత్రం కారు గుర్తుకే మొగ్గు చూపారు.
జనగామ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మంత్రి పొంగులేటి చేసిన ప్రచారం చేశారు. అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కాంగ్రెస్, బీఆర్​ఎస్​ 13 వార్డుల చొప్పున సమానంగా గెలుచుకున్నారు. స్వతంత్రులు 2, ఇతరులు రెండు చొప్పున సత్తా చాటారు.
Follow Us