Municipal Election Results 2026 : కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. మేడ్చల్ లో BRS, BJP జోరు!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఉదయం నుంచి ఉత్కంఠగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రమైన ఫలితాలు వెలువడుతున్నాయి.

New Update
Congress

Congress

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆలియాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఉదయం నుంచి ఉత్కంఠగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో చిత్ర విచిత్రమైన ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సత్తా చాటుతున్నారు. దీంతో ఇక్కడ ఫలితాలు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 7వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన వెంకటేశ్‌ అనూహ్య విజయాన్ని నమోదు చేశారు. పార్టీల అండ లేకపోయినా స్థానిక ప్రజల మద్దతుతో ఆయన గెలుపొందడం విశేషం.

మరోవైపు బీజేపీ కూడా ఆలియాబాద్‌లో దూకుడుగా వెళ్తుంది. 4వ వార్డులో బీజేపీ అభ్యర్థి దీపిక ఘన విజయం సాధించారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ కూడా తన పట్టును నిరూపించుకుంది. 19వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గెలిచిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ మున్సిపాలిటీ వ్యాప్తంగా సందడి చేస్తున్నారు.

కాగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాలు వేగంగా వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాదాపు 68-76 మున్సిపాలిటీలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిస్తోంది. సుమారు 29-36 మున్సిపాలిటీల్లో ఈ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం 15వ వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది.

Advertisment
తాజా కథనాలు