/rtv/media/media_files/2026/02/14/fotojet-7-2026-02-14-17-26-08.jpg)
Big shock for BJP floor leader.. Congress flag in his area
Breaking : భారతీయ జనతా పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైన అత్యధిక మున్సిపాలిటీల్లో పాగా వేయాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ అనుకున్న ఫలితాలను సాధించలేదు. పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ బీజేపీ అంతగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఇలాకా నిర్మల్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఆ పార్టీకి మింగుడుపడని విషయం. నిర్మల్ లో ఎలాగైన విజయం సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పన్నిన వ్యూహం ఫలించి అక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది.
నిర్మల్ మున్సిపాలిటిపై నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునితో వ్యూహం రచించిన ముఖ్యమంత్రి దాన్ని కైవసం చేసుకోవడంలో సఫలం అయ్యారు. నిర్మల్‌లో 42 వార్డులు ఉండగా కాంగ్రెస్ ఏకపక్షంగా 24 స్థానాల్లో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. ఇక్కడ బీజేపీ13 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కి చుక్కెదురైంది.బీజేపీ శాసనసభ పక్ష నేత ఇలాకాలో కాంగ్రెస్ జెండా ఎగరడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ ఎవరి మద్దతు లేకుండా 24 స్థానాలతో చైర్మన్ కుర్చీ కైవసం చేసుకోనుంది.
బీజేపీ నాయకత్వం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికి బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రచారం చేసినప్పటికీ బీజేపీ వ్యూహం ఫలించలేదని అంటున్నారు. మున్సిపల్ అభ్యర్థులు గెలుస్తారని ఆలోచనతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముందుగానే వారిని క్యాంపులకు పంపించారు. అయితే అనుకున్న స్థాయిలో ఫలితం దక్కకపోవడానికి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వైఖరే కారణమని స్థానిక నేతలు అంటున్నారు, ఆయన ఒంటెద్దు పోకడనే కొంప ముంచిందని బీజేపీలోని ఓ వర్గం చెవులు కొరుక్కొంటుంది.
కాంగ్రెస్ హవా..
నిర్మల్ మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేందుకు వీలుగా కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం వచ్చింది. ఆ పార్టీ పక్కా వ్యూహంతో చేసిన ప్రచారం విజయానికి దోహదం చేసింది. పట్టణంలో 42 వార్డులుండగా 24 స్థానాలకు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. బీజేపీకి ఆశించిన స్థానాలు రాకపోయినా 13 వార్డుల్లో ఆపార్టీ అభ్యర్థులు విజయం సాధించింది. ఇక 36 వార్డుల్లో పోటీచేసిన బీఆర్‌ఎస్ కేవలం రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. 19 వార్డుల్లో పోటీ చేసిన ఎంఐఎం మూడు స్థానాల్లో గెలుపొందింది.
Follow Us