/rtv/media/media_files/2025/09/06/balapur-1-2025-09-06-10-22-33.jpg)
హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. మరికాసేపట్లో నిమజ్జన కార్యక్రమం కూడా ముగియనుంది. హైదరాబాద్ లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే ఖైరతాబాద్ లోని మహా గణపతితో పాటుగా బాలాపూర్ లడ్డూ చాలా ఫేమస్. ఈ లడ్డూను వేలంలో దక్కించుకోవడం కోసం చాలామంది పోటీ పడుతుంటారు.ఈ సారి ఏకంగా 38 మంది బరిలో ఉన్నారు. బాలాపూర్ లడ్డూ వేలానికి సుమారు మూడ దశాబ్ధాల చరిత్ర ఉంది. అసలు ఈ వేలంలో ఎలా పాల్గొనాలి..రూల్స్ ఎంటీ ఇప్పుడు చూద్దాం.
బాలాపూర్ లడ్డూ వేలంలో పాల్గొనడానికి, ముందుగా కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. వేలంలో పాల్గొనాలనుకునేవారు ముందుగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను వినాయక చవితి మొదటి రోజు నుండి నిమజ్జనం రోజు ఉదయం 7 గంటల వరకు స్వీకరిస్తారు.
కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి
వేలంపాటలో పాల్గొనేవారు ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. ఉదాహరణకు, గత సంవత్సరం లడ్డూ ధర (రూ. 30 లక్షలు) డిపాజిట్ చేసిన వారికి మాత్రమే వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఈ నియమం స్థానికులతో పాటు బయటివారికి కూడా వర్తిస్తుంది. లడ్డూ వేలంపాట సాధారణంగా రూ. 1,116తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వేలంపాటలో పాల్గొన్నవారు పాటను పెంచుతూ వెళ్తారు. వేలంపాట బాలాపూర్ గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద బహిరంగంగా నిర్వహిస్తారు. వేలంలో ఎక్కువ ధర పలికిన వారికి లడ్డూ దక్కుతుంది.
లడ్డూను గెలుచుకున్నవారు నిర్దిష్ట సమయంలో చెల్లింపు చేయాల్సి ఉంటుంది. గతంలో గెలుచుకున్నవారు మరుసటి సంవత్సరం చెల్లించే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు నిబంధనలు కఠినతరం అయ్యాయి. బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు, వ్యాపారంలో లాభాలు, పంటలు బాగా పండుతాయని ప్రజల నమ్మకం. అందుకే, ప్రతి సంవత్సరం దీని వేలం రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది. ఇక ఇలా వేలం ద్వారా వచ్చిన డబ్బును బాలాపూర్ గ్రామాభివృద్ధి, దేవాలయాలు, పాఠశాలలు వంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తారు.