Asadhuddin: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)కి కూటమి ప్రభుత్వం తాజాగా పాలకమండలి నియమించిన విషయం తెలిసిందే. టీటీడీ ఛైర్మన్ గా బీఆర్ నాయుడును నియమించింది. అయితే ఇటీవల ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!
టీటీడీలో కేవలం హిందువులే ఉండాలి..
ఇటీవల బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టీటీడీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. తిరుమలలో పని చేసే వారు కేవలం హిందువులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీలో పనిచేస్తున్న హిందూయేతర ఉద్యోగుల్ని వేరే డిపార్ట్‌మెంట్లకు బదిలీ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అజెండా తనకు ఉందన్నారు.
Also Read: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. నెలకు రూ.15 నుంచి 40వేలు జీతంతో పాటు!
అయితే.. టీటీడీ కొత్త ఛైర్మన్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వక్ఫ్ బోర్డులోకి ముస్లిమేతరులను తేవొచ్చు కానీ, మీ టీటీడీలో హిందుయేతరులు ఉండొద్దా? అని ప్రశ్నించారు. దీనిపై టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు ఎలా కౌంటర్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
Also Read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు!