/rtv/media/media_files/2026/02/04/fotojet-2026-02-04t112536-2026-02-04-11-26-07.jpg)
Jagtial MLA Sanjay
BIG BREAKING : పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో ఎమ్మెల్యేకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి క్లీన్ చీట్ ఇచ్చిన స్పీకర్ సంజయ్ పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవన్నారు. సంజయ్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు ఆయన తీర్పు వెలువరించారు. గతంలో ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలోనూ స్పీకర్ ఇదే తరహాలో తీర్పు ఇచ్చిన విషయం విదితమే. కాగా సంజయ్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ వేసిన విషయం విదితమే.
పార్టీ ఫిరాయింపులపై జగిత్యాల ఎమ్మెల్యేపై అనేక సార్లు విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదోపవాదనల అనంతరం.. ఆయన పార్టీ మారారు అనేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టమైన ప్రకటన చేశారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు ఆయన వెలువరించారు.
గతంలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు ఎమ్మెల్యేల అంశంలో స్పీకర్ ఇదే తరహా తీర్పును వెలువరించారు. పార్టీ మారినట్లు వారిపై ఆధారాలు లేకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.అయితే మరో ఇద్దరు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు సంబంధించిన కేసు ప్రస్తుతం పెండింగ్‌లో ఉంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై విచారణ పూర్తి కావడంతో తగిన ఆధారాలు లేవని స్పీకర్.. ఆయనకు సైతం క్లీన్ చీట్ ఇచ్చారు.
Follow Us