/rtv/media/media_files/2025/07/16/ramagundam-fertilizers-company-2025-07-16-21-39-22.jpg)
Ramagundam Fertilizers Company
RFCL : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)లో బుధవారం సాయంత్రం అమ్మోనియా వాయువులు లీక్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఉత్పత్తిని నిలిపివేసి ప్లాంట్‌ను షట్‌డౌన్ చేశారు. అయితే ఈ ఘటనలో కార్మికులు ఎవరైనా గాయపడ్డారా? అస్వస్థతకు గురయ్యారా అనే విషయాలు తెలియలేదు. గ్యాస్ లీకేజీతో ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగినట్లు తెలుస్తోంది. కొంతకాలం పాటు ప్యాక్టరీలో ఉత్పత్తి నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారణంగా రూ. 200 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ రోజుకు 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ప్రస్తుత ఘటన వల్ల పర్యావరణ కాలుష్యం, భద్రతా సమస్యలపై అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఖచ్చితమైన కారణాలు, సాంకేతిక వివరాలు తెలియరాలేదు.