/rtv/media/media_files/2025/02/17/v0wYNlTJTIdmmJBw8ObZ.jpg)
Fake seeds
TG Framers : వికారాబాద్ జిల్లాలో పదిలక్షల విలువ చేసే నకిలీ విత్తనాలను జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్,టాస్క్ ఫోర్స్ టీమ్, పెద్దేముల్ పోలీస్ అధికారులు, పెద్దేముల్ వ్యవసాయాధికారి పి.పవన్ ప్రీతంలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు వికారాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు విత్తనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. భారీ వర్షాలు, వరదలతో 9 మంది మృతి.. ట్రంప్ కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కోనంకి గ్రామానికి చెందిన ఉప్పలపాటి వసంత్‌రావు అనేవ్యక్తి గత 15 సంవత్సరాలుగా కర్ణాటకలోని యాద్గీర్ జిల్లా గాజుర్‌కోట్ గ్రామంలో నివసిస్తున్నాడు. అతను గత కొంతకాలంగా కర్ణాటకలోని గుర్మిట్కల్ నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో అమాయక రైతులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పంటల సీజన్ అయిన జూన్, జూలై నెలల్లో పోలీసుల నిఘా ఎక్కువగా ఉంటుందనే ఉద్ధేశంతో ప్రభుత్వ అధికారులకు అనుమానం రాకుండా ముందుగానే నకిలీ పత్తి విత్తనాలను తీసుకొని వచ్చి అమాయక రైతులకు ఎక్కువ ధరలకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలోనే పెద్దేముల్ వచ్చిన వసంత్ విత్తనాల విక్రయానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: తీరు మార్చుకోని అగ్రరాజ్యం..మరోసారి సంకెళ్లతోనే వారిని భారత్ కు పంపిన వైనం!
పెద్దేముల్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వసంత్ నాలుగు ప్లాస్టిక్ సంచులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు ఆరాతీశారు. అతనితో పాటు ఉన్న సంచులను పరిశీలించగా వాటిలో ఎలాంటి లేబుల్స్ కాని, లాట్ నెంబర్ గాని, బ్యాచ్ నెంబర్స్ గాని , తయారుచేసిన తేది గాని,గడువు తేది గాని ఎలాంటి సమాచారం లేని పత్తి విత్తనాల ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆ విత్తనాలను వ్యవసాయాధికారి పరిశీలించి నకిలీ పత్తి విత్తనాలు అని తేల్చారు. దీంతో వసంత్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?
కాగా అతని నుంచి మొత్తం 4 నాలుగు సంచులు స్వాధీనం చేసుకోగా వాటిలో రూ.2.70,000 విలువ కల్గిన150 కేజీల నకిలీ పత్తి విత్తనాలు ఉన్నట్లు తెలిపారు. కాగా అతను ఇచ్చిన సమాచారంతో కర్ణాటకలోని అతని ఇంటినుంచి రూ.7,20,000 లక్షల విలువ కల్గిన 4 క్వింటల్లా నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇతనిపై గతంలో బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: TG New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
కాగా జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింతే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని , రైతులు నకిలీ విత్తనాల భారీన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరైన వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్థానిక పోలీసులకుగాని లేదా టాస్క్ ఫోర్స్ అధికారులకు గాని డయల్ 100కు గాని సమాచారం అందించాలని కోరారు.
Also Read: Telangana Crime: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం బావనే హతమార్చిన బావమరిది!