తెలంగాణలో తగ్గిపోతున్న గాలి నాణ్యత.. ప్రమాదంలో ఆ జిల్లాలు

తెలంగాణలో కూడా గాలి నాణ్యత దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో ఎయిర్‌ క్వాలిటీ పడిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
AQI

ప్రస్తుతం ఢిల్లీ గాలి నాణ్యత దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏడాది దీపావళికి మందు అక్కడ ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. అయితే తెలంగాణలో కూడా గాలి నాణ్యత దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో ఎయిర్‌ క్వాలిటీ పడిపోతున్నట్లు తెలుస్తోంది. పట్టణాల పరిధిని విస్తరించడం, నిర్మాణాలు, వాహనాలు, పరిశ్రమలు పెరిగిపోతుండటం లాంటి కారణాల వల్ల వాయు కాలుష్యం పెరిగిపోతోంది. దీనివల్ల గాలిలో కాలుష్య కారకాలైన న పార్టిక్యులేట్‌ మ్యాటర్ (పీఎం) 2.5, పీఎం 10 స్థాయిలు పెరుగుతున్నాయి.

Also Read: జమిలి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం.. మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలోని 23 రోజుల్లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్ (AQI) వందకు పైగా నమోదవుతోంది. హనుమకొండ, వరంగల్, హైదరాబాద్‌కు మించి ఏక్యూఐ నమోదం కావడం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్‌లో ఎక్కువగా ఏక్యూఐ 143 ఉండగా.. పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఏడాదిలో ఏక్యూఐ సగటు 120 ఉండగా.. దాదాపు 180 రోజుల పాటు అదే స్థాయిలో ఏక్యూఐ రికార్డు అవుతోంది. హనుమకొండలో ఏక్యూఐ 130 ఉండగా.. పీఎం 2.5 స్థాయిలు క్యూబిక్ మీటర్ గాలిలో 48 మైక్రోగాముల వరకు ఉన్నాయి. ఏడాదిలో ఏక్యూఐ సగటు 116 ఉండగా.. 179 రోజుల్లో అంతేస్థాయిలో ఏక్యూఐ రికార్డు అయ్యింది.    

మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌ తదితర జిల్లాల్లో కూడా ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగానే ఉంటోంది. హైదరాబాద్‌లో ఏక్యూఐ 128 ఉండగా.. పీఎం 2.5 స్థాయిలు 46 గ్రాముల మేర ఉంటున్నాయి. ఏడాదిలో చూసుకుంటే మొత్తం 166 రోజుల పాటు గాలి నాణ్యత అత్యంత తక్కువగా నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 

Also Read: కొండా సురేఖకు రేవంత్ వార్నింగ్.. అందరి ముందే ఏమన్నాడంటే?

ఇక ఏక్యూఐ స్థాయి 50 దాటిందంటే అది చెడు గాలి అని నిపుణలు చెబుతున్నారు. పది జిల్లాల్లో ఏక్యూఐ స్థాయి 75 నుంచి 99 మధ్య ఉంది. ఇక మిగతా జిల్లాల్లో 100 నుంచి 149 మధ్య రికార్డవుతోంది. 50 నుంచి 100 మధ్య ఏక్యూఐ ఉంటే గాలి నాణ్యతను పూర్‌ క్వాలిటీగా పరిగణిస్తారు. 100 నుంచి 150 వరకు ఉంటే అన్‌హెల్తీగా, 150 నుంచి 200 మధ్య ఉంటే అత్యంత అనారోగ్యకరంగా, 200-300 మధ్య ఉంటే ప్రమాదకరంగా భావిస్తారు. ఇక 300 దాటితే అత్యంత ప్రమాదకరంగా చెబుతారు. అయితే ఇప్పుడు తెలంగాణ ఏక్యూఐ అన్‌హెల్తీ స్థానంలో ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు