/rtv/media/media_files/2025/01/28/F84UXyQn9pNJIJZ4Tpv6.webp)
Child died in Lorry Accident
lorry accident : మరికొంతసేపైతే తన స్నేహితులతో కలిసి ఆడుతూ, పాడుతూ గడపాల్సిన చిన్నారి లారీ చక్రాల కింద పడి నలిగిపోయింది. తన తండ్రితో కలిసి ఆనందంగా స్కూల్‌కు బయలుదేరిన ఆ చిన్నారి స్కూల్‌కు చేరకుండానే నిండు నూరేళ్లు నిండిపోయాయి. తండ్రి కండ్లముందే చిన్నారిని మృత్యుశకటంలా వెనుకే వచ్చిన లారీ చిదిమేసింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో అత్యంత విషాదం నెలకొంది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి స్కూల్ కు బయలు దేరిన చిన్నారిని ఓ లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ చిన్నారిపై నుంచి లారీ వెళ్లడంతో నడిరోడ్డుపైన ఆ చిన్నారి శరీరం రెండు ముక్కలైంది.
అత్యంత విషాదకరమైన ఈఘటనలో చిన్నారి అక్కడక్కడి మృతి చెందింది. చిన్నారి శరీరం ఘటన స్థలంలోనే ముక్కలవ్వడంతో ఆ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. కండ్లముందే చిన్నారి లారీ చక్రాల కింద నలిగిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. లారీ ఆపి డ్రైవర్‌ను కిందకు దింపి దాడి చేశారు. వాస్తవానికి ఉదయం 6 దాటితే భారీ వాహనాలకు నగరంలోకి అనుమతిలేదు. కానీ ఆ లారీ డ్రైవర్ నగరంలోకి రావడమే కాకుండా అతివేగంతో బైక్‌ను ఓవర్ టేక్ చేయబోయి చిన్నారి ప్రాణం తీశాడు. బైక్ ను వెనుకనుంచి ఢీకొనడంతో పాప అథర్వి బైక్‌పై నుంచి లారీ కింద పడిపోయింది. అథర్విపై నుంచి లారీ వెళ్లడంతో చిన్నారి మృతదేహం నుజ్జునుజ్జయింది. ఐదో తరగతి విద్యార్థిని గడ్డం అథర్విని అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన తర్వాత.. యాక్సిడెంట్ జరిగిన తీరును చూసిన స్థానికులు.. రోడ్డున వెళ్లే వారు.. లారీ డ్రైవర్ ను పట్టుకుని చితక్కొట్టారు. 9 గంటల సమయంలో ఓ లారీ.. నడిరోడ్డుపై.. రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్నారిని ఢీకొట్టిన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తుంది.
చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.