సాధారణంగా ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదిస్తాం. ప్రాణాలు పోయేంత కష్టం వచ్చినా వైద్యులపై నమ్మకం పెట్టుకుంటాం. కానీ కొందరు వైద్యులు డ్యూటీ సమయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్య వచ్చింది బాబూ అంటూ వారి వద్దకు వెళ్తే నిర్లక్ష్యంగా వ్యవహరించి పేషెంట్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఇది కూడా చదవండి: అంధులకు దారి చూపించే AI కళ్లద్దాలు.. చదివిస్తాయి కూడా
ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు వారి నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాలు తీస్తున్నారు. దీంతో ఏదైనా అనారోగ్య సమస్య వస్తే హాస్పిటల్‌కి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా సర్జరీలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే అవతలి ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయి. తాజాగా అలాంటి నిర్లక్ష్యంతోనే ఒక నిండు ప్రాణం బలైంది. ఎన్నో ఏళ్లు జీవించాల్సి 5ఏళ్ల చిన్నారి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది.
ఇది కూడా చదవండి: నకిలీ RTO ఘరానా మోసం.. ఈ ట్విస్టు ఊహించడం కష్టమే భయ్యా!
హాస్పిటల్‌లో దారుణం
హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం జరిగింది. కంటిలో నలుసు పడిందని 5 ఏళ్ల చిన్నారి అన్వికను ఆనంద్ ఐ ఇన్సిట్యూట్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అన్విక కంటికి సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఇందులో భాగంగానే సర్జరీ చేసేముందు అన్వికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చారు.
ఇక ఆ మత్తు ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే చిన్నారి అన్విక మృతి చెందింది. ఇంజక్షన్ హెవీ డోస్ కారణంగా పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు. కంటిలో నలుసు పడిందని హాస్పిటల్‌కు తీసుకొస్తే.. ప్రాణమే పోయిందని రోదిస్తున్నారు. హాస్పిటల్ వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.