స్కూల్లో పెట్టిన మైసూర్ బోండాలు తిని గురుకుల పాఠశాల బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం నాగారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో 33 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. స్కూల్లో పెట్టిన మైసూర్ బోండాలు తినడం వలన వాంతలు, కడుపు నొప్పితో బాలికలు బాధపడుతున్నారు. వీరిని వెంటనే ఘట్ కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తరువాత 15 మంది తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. మిగతతా వారు మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. విద్యార్ధినులు అజీర్తి సమస్యతో బాధపడుతున్నారని డాక్టర్లు చెప్పారు.
ఆగని ఫుడ్ పాయిజన్ ఘటనలు..
రీసెంట్‌గా పాఠశాలల్లో ఫుడ్ తిని అస్వస్థతకు గురైన సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం నారాయణపేట్ జిల్లా మగనూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 25 మంది అస్వస్థకు గురవ్వడం కలకలం రేపింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకొని అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఫుడ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను రేవంత్ ఆదేశించారు.
దాని తరువాత కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వల్ల స్టూడెంట్స్ తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. ముగ్గురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. మరో 20 మంది కడుపునొప్పితో విలవిల్లాడారు. వెంటనే ఉపాధ్యాయులు వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో.. పాఠశాలకు చేరుకున్నారు. ఆపై విద్యార్థులను పరీక్షించి మందులు అందించారు.
హైకోర్ట్ సీరియస్..
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజనం కేసులో హైకోర్టు సీరిస్ అయింది. ఇటీవల వరుస ఫుడు పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడంపై దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యార్థులకు నిర్దేశించిన పోషకాలతో కూడిన ఆహారం పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కలుషిత ఆహారం కారణంగా బడి పిల్లలు అస్వస్థతకు గురైన సంఘటన పూర్తి నివేదికను సమర్పించాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఫుడ్ పాయిజన్ గురించి రెండు కమిటీలను వేసింది. అయినా కూడా ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి.
Also Read: AP: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..21 అంశాలకు ఆమోదం