ఓ వైపు సైబర్ నేరగాళ్లు సంపన్నుల నుంచి కోట్లు దోచేస్తున్నారు. ఫోన్లకు లింక్ పంపించి దాన్ని క్లిక్ చేయగానే సొమ్మును కొట్టేస్తున్నారు. ఇక ఈ మధ్య ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మరో కొత్త స్కాంకి కేటుగాళ్లు తెరలేపారు. సంపన్నులే లక్ష్యంగా చేసుకుంటున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దోచేస్తున్నారు. ప్రభుత్వ అధికారులమంటూ కాల్ చేస్తున్నారు. మనీలాండరింగ్, డ్రగ్స్ స్మగ్లింగ్ జరిగిందంటూ భయపెడుతున్నారు. కేసు నుంచి బయటపడాలంటే కొంత సొమ్మును తమ ఖాతాకు ట్రాన్సఫర్ చేయాలని చెప్పి డబ్బును స్వాహా చేసుకుని ఆపై సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసేస్తున్నారు. ఈ మధ్య ఈ వ్యవహారం భారీగా పెరిగిపోయింది.
ఇది కూడా చూడండి: Rotten Chicken: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!
అయితే ఇప్పుడు మరో మోసం జరిగింది. అయితే ఇది సైబర్ స్కాం కాదు. తెలిసిన వ్యక్తే మోసం చేశాడు. తనకు సాఫ్ట్‌వేర్ సంస్థలన్నీ తెలుసని.. బడా బడా వ్యక్తులతో బాగా పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. ఎవరైనా తెలిసినవారు ఉంటే చెప్పండి.. తక్కువ అమౌంట్ కట్టి జాబ్‌లో చేర్పిస్తానని చెప్పాడు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు అంటూ నమ్మించాడు. ఇదంతా నిజమేనని నమ్మి ఓ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తులతో లక్షలు కట్టించాడు. ఆ తర్వాత జాబ్ ఇప్పిస్తానన్న వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: ప్రేమ నిరాకరించిందని.. ఇంటర్ అమ్మాయిని దారుణంగా చంపిన యువకుడు!
సాఫ్ట్‌వేర్ కంపెనీలతో బాగా పరిచయాలు ఉన్నాయి
వాసు అనే వ్యక్తి హైదరాబాద్‌లోని స్రవంతినగర్‌లో నివాసముంటున్నాడు. అతడు టీసీఎస్‌లో జాబ్ చేస్తున్నాడు. అయితే అదే కంపెనీలో పనిచేసే చల్ల శ్రీరాంకిరణ్ అనే వ్యక్తి వాసుకి పరిచయం అయ్యాడు. అనంతరం శ్రీరాంకిరణ్ తనకు వివిధ సాఫ్ట్‌వేర్ కంపెనీలతో బాగా పరిచయాలు ఉన్నాయని వాసుకి చెప్పాడు. ఎవరైనా తెలిసిన వారు ఉంటే వారికి తక్కువ అమౌంట్‌కే సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు.
ఇది కూడా చూడండి: సల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్
రూ.26 లక్షలు ట్రాన్సఫర్
ఇదంతా నిజమేనని నమ్మిన వాసు తనకి తెలిసిన వారితో మాట్లాడాడు. ఆపై దాదాపు 17 మందిని శ్రీరాం కిరణ్ వద్దకు తీసుకెళ్లాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఐబీఎం సంస్థలో జాబ్ కోసం ఈ 17 మంది శ్రీరాంకిరణ్, అతడి భార్య సంధ్యారాణి ఖాతాల్లోకి సుమారు రూ.26 లక్షలు ట్రాన్సఫర్ చేశారు. అనంతరం శ్రీరాంకిరణ్ వారికి జాబ్ వచ్చినట్లు ఆఫర్ లెటర్స్ సైతం పంపించాడు.
ఇది కూడా చూడండి: TN: గవర్నర్‌ను రీకాల్ చేయండి...కేంద్రానికి స్టాలిన్ డిమాండ్
నకిలీ డాక్యుమెంట్స్
దీంతో ఆ 17 మంది ఎంతో ఆనందంతో జాబ్ చేరడానికి వెళ్లడంతో అవి నకిలీ డాక్యుమెంట్స్ అని చెప్పారు. వెంటనే దీనిపై వారు వాసుని సంప్రదించగా.. అతడు శ్రీరాంకిరణ్‌ను ప్రశ్నించాడు. అయితే వారికి మరో కంపెనీలో జాబ్ ఇప్పిస్తానని నమ్మించాడు. అనంతరం శ్రీరాంకిరణ్, తన భార్యతో కలిసి పారారైపోయాడు. సెల్‌ఫోన్‌లు సైతం స్విచ్చాఫ్ చేసుకున్నారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.