పది రూపాయల కోసం లొల్లి.. మాటమాట పెరిగి తన్నుకున్నారు

రూ. 10 కోసం 75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై  ఓ బస్సు కండక్టర్ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్లో చోటు చేసుకుంది. దాడి చేసిన కండక్టర్ ను సస్పెండ్ చేశారు ఆర్టీసీ అధికారులు.

New Update
bus conductor

bus conductor Photograph: (bus conductor )

75 ఏళ్ల రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై  ఓ బస్సు కండక్టర్ దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఘటన రాజస్థాన్ లోని జైపూర్లో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..  రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన మీనా ఓ బస్సు ఎక్కాడు. అయితే తాను దిగాల్సిన స్టాప్ లో దిగలేకపోయాడు. దీంతో కండక్టర్ ఘనశ్యామ్ శర్మ తరువాతి స్టాప్లో దిగాలని ఆయనకు చెప్పాడు. అందుకు రూ.10 ఇచ్చి టికెట్ తీసుకోవాలని అన్నాడు. అందుకు మీనా నిరాకరించాడు.  బస్సు స్టేజీ పేరు సరిగ్గా చెప్పకపోవడం కండక్టర్ తప్పేనని వాదించాడు.. అతడి తప్పుకు తానెందుకు డబ్బు చెల్లించాలంటూ ప్రశ్నించాడు. 

మాటమాట పెరిగి

దీంతో  మీనా,  కండక్టర్ ఘనశ్యామ్కు మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలో  మీనాను కండక్టర్ నెట్టివేశాడు. దీంతో మీనా కోపం పట్టలేక కండక్టర్ చెంపపై కొట్టాడు.  దీంతో మరింత రెచ్చిపోయిన కండక్టర్.. మీనాపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తోటి ప్రయాణికులు ఆపినా ఆగకుండా దాడి చేశాడు. బస్సులోనే ఉన్న ఓ ప్రయాణీకుడు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడిది వైరల్ గా మారింది.  

అయితే తనపై జరిగిన దాడిపై  రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మీనా కనోటా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  అతని ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు కండక్టర్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు. మీనాపై దాడి చేసిన కండక్టర్ ను సస్పెండ్ చేసినట్లు జైపూర్ సిటీ ట్రాన్స్ పోర్ట్ సర్వీస్ వెల్లడించింది.  ఇక మరోక ఘటనలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు పాల్ఘర్ జిల్లాలో ఒక వ్యక్తిని వసాయ్ రైల్వే పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.  

Also Read  :  Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే

Advertisment
తాజా కథనాలు