Telangana Weather Today: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 16 జిల్లాలకు ఎఫెక్ట్!

తెలంగాణ లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈరోజు (జూన్ 12) రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న(జూన్ 11) రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. గురువారం కూడా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. 

author-image
By KVD Varma
New Update
Telangana Weather Today: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ 16 జిల్లాలకు ఎఫెక్ట్!

Telangana Weather Today: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలు చురుకుగా కదులుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని చెబుతున్నారు. 

భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్న జిల్లాలు ఇవే..
నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి

ఈదురుగాలులతో వర్షాలు ఈ జిల్లాల్లో..
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి 

Telangana Weather Today: రాబోయే రెండు రోజుల్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు గురువారం కూడా కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 

Also Read: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వానలే వానలు!

రాష్ట్రవ్యాప్తంగా వానలు..
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారంలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా..  సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదీగూడలో 6.5, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6, తుప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 5.8, శంకరంపేటలో 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పిడుగుపాటుతో ఇద్దరు రైతులు మృతి  చెందారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు