Telangana Weather Report: తెలంగాణకు మరోసారి వర్ష సూచన చేసింది హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం. ఇవాళ ఉత్తర కోస్తా కర్నాటక పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు కోస్తా వద్ద నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రేపు, ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాతావరణ కేంద్రం అధికారులు.
కాగా, రాగల మూడు రోజులు ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు. ఇక హైదరాబాద్‌లో వర్షాలు దంచి కొడతాయని చెబుతున్నారు. రెండు రోజులు హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం, శనివారం నగరంలో వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందన్నారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
జిల్లాల వారీగా చూసుకుంటే..
అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమరం భీమ్, మెదక్, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు నుంచి భారీ వర్షం అక్కడక్కడ కురుస్తుందని చెప్పారు వాతావరణ కేంద్రం అధికారులు. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
ఇక జనగాం, కామారెడ్డి, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం, అక్కడక్కడ అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. దాంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు అధికారులు.
Also Read:
Earthquake Alert Service: భూకంపం వస్తే మీ ఫోన్ ముందే చెప్పేస్తుంది.. అదెలాగంటే..