TG DSC : టీచర్ నియామకాలపై కీలక అప్ డేట్.. ఒక్కోపోస్టుకు ఎంత మందిని పిలుస్తారంటే! తెలంగాణ టీచర్ అభ్యర్థుల నియామకాలపై మరో అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. ఆగస్టు లాస్ట్ వీక్‌లో రిజల్ట్ రిలీజ్ చేసి.. ఒక పోస్టుకు ముగ్గురు మెరిట్ అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలిచేందుకు విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. By srinivas 20 Aug 2024 in జాబ్స్ తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : తెలంగాణ టీచర్ అభ్యర్థుల నియామకాలపై కీలక అప్ డేట్ వెలువడింది. ఆగస్టు నెలఖరులోగా ఫలితాలను వెల్లడించి రానున్న రెండు నెల్లలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అంచజేసేందుకు కసరత్తులు చేస్తోంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. ఈ వారమే ఫైనల్ కీ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 1:3 రేషియాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. ఇదిలా ఉంటే.. డీఎస్సీలో మెరిట్ అభ్యర్థులను 1:3 రేషియాలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టబోతున్నట్లు సమాచారం. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, పండిట్, పీఈటీ కేటగిరీలో ఒక్కోపోస్టుకు ముగ్గురుచొప్పున పిలిచేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు పేపరు లీక్ అయిందనే వాదనలు కూడా నడుస్తున్నాయి. జులై 19న మార్నింగ్ నిర్వహించిన ఎస్జీటీ తెలుగు మీడియం పరీక్ష పేపరు ఆగస్టు 23 మధ్యాహ్నం రాసిన పేపర్ లో ప్రశ్నలన్నీ ఒకేరంకంగా ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ.. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పింది. జిల్లాలు వేర్వేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదని, కాబట్టి అభ్యుర్థులు ఆందోళన చెందకూడదని పేర్కొంది. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా 2.45 లక్షల మంది హాజరయ్యారు. Also Read : తెలంగాణలో రుణమాఫీపై రచ్చ.. ఎవరి వాదన కరెక్ట్? #tg-dsc #telangana-teacher #appointments-update మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి