Telangana: ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. టీటీడీపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన..

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఇందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు కాసాని. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఏపీపైనే దృష్టి పెట్టింది. దీంతో తెలంగాణపై ఫోకస్ చేయలేని పరిస్థితి నెలకొంది. అందుకే తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకోవాలని తెలంగాణ నేతలకు చంద్రబాబు సూచించారని తెలుస్తుంది.

Telangana: ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. టీటీడీపీ అధ్యక్షుడి సంచలన ప్రకటన..
New Update

Telangana TDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తెలుగుదేశం పార్టీ(TDP) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే, చంద్రబాబు సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం రాజమండ్రి జైలులో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్ చేయలేమని చంద్రబాబు.. కాసానికి తెలిపారు. ఈ కారణంగానే తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందని, ఇందుకు గల కారణాన్ని పార్టీ నేతలకు వివరించాలని కాసానికి సూచించారు చంద్రబాబు. ఈ నిర్ణయం ప్రకారం.. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రకటించారు కాసాని.

బాబుతో కాసాని ములాఖత్..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబుతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ శనివారం(అక్టోబర్ 28) ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో పోటీ చేసే అంశంపై చంద్రబాబుతో డిస్కస్ చేశారు. అయితే, ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై ఫోకస్‌ పెట్టలేమని చంద్రబాబు బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, లేదంటే సైలెంట్‌గా పక్కకు తప్పుకోవడం ఉత్తమం అని సూచించారు చంద్రబాబు. ప్రస్తుత పరిస్థితులు సరిగా లేవని, వచ్చే ఏడాది మే నెలలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయన్నారు చంద్రబాబు. ఈ కారణంగా ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందన్నారు. ఏపీలో ఎన్నికల్లో విజయం సాధిస్తే.. తెలంగాణలోనూ పార్టీ బలం పుంజుకుటుందన్నారు చంద్రబాబు. ఏదో మొక్కుబడిగా పోటీ చేసి, ఆశించిన ఫలితం రాక బాధపడటం కంటే.. ఎన్నికలకు దూరంగా ఉండటం మేలని కాసానికి దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు వివరించాలని కూడా సూచించారు. అవసరమైతే మరోసారి చర్చిద్దామని కాసానితో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

50 రోజులుగా జైల్లోనే చంద్రబాబు..

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు.. దాదాపు 50 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో వాదనలు, విచారణలు జరుగుతున్నాయి. ఇక మరో నాలుగు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో టీడీపీ ప్రధానంగా ఏపీపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది. ఏపీలో అధికారంలోకి వస్తే.. ఆ తరువాత తెలంగాణపై ఫోకస్ చేయొచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగానే.. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది పార్టీ.

Also read:

అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..

#telangana-elections #chandrababu #telugu-desam-party #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe