Telangana : ఆవిష్కరణకు సిద్ధమైన తెలంగాణ రాష్ట్ర గీతం.. 2 నిమిషాల 30 సెకండ్ల నిడివితో

జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా 'జయ జయహే తెలంగాణ' గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను రెడీ చేశారు. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం ఉండనున్నట్లు సమాచారం.

New Update
BIG TWIST: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా

Telangana State Song : తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఊరు, వాడలో మారుమోగిన పాట 'జయ జయహే తెలంగాణ' (Jaya Jaya He Telangana). జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం (Telangana Incarnation Day) సందర్భంగా ఈ గీతం ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది. మొత్తం 13 చరణాలతో కూడిన పాటను రెడీ చేశారు. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం ఉండనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహిత ఎం.ఎం కీరవాణి (M.M. Keeravani).. ఆయన గాన బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితర నేతల్ని కలిశారు.

Also Read: తెలంగాణలో కులగణనకు సిద్ధం.. ఎప్పటినుంచంటే

కీరవాణి స్వరపరిచినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని విన్నారు. తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా, అస్థిత్వానికి ప్రతీకగా, ఆత్మగౌరవం, సాంస్కృతికతను ప్రతిబింబించేలా అందెశ్రీ రాసిన ఈ గీతం 6 నిమిషాల నిడివి ఉంది. దాని ఔనత్యం దెబ్బతినకుండా ప్రతిఒక్కరూ సులువుగా ఆలపించేలా కీరవాణి బృందం ఈ పాటను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే ఈ పాట ఎలా ఉండనుందో తెలియాలంటే జూన్ 2 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: రాష్ట్ర చిహ్నం మార్పుపై రగడ.. బీఆర్‌ఎస్‌కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్

Advertisment
తాజా కథనాలు