కొన్ని నెలలుగా.. తెలంగాణ ప్రగతిభవన్, రాజ్‌భవన్ మధ్య చిచ్చు కొనసాగుతూనే ఉంది. గవర్నర్ తమిళసై వర్సెస్ సీఎం కేసీఆర్ (Governor Vs Cm) అన్నట్టుగా దేశవ్యాప్తంగా (National Wide) చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రభుత్వం తన ఫోన్‌ని ట్యాప్ (Phone Tap)చేసిందంటూ గవర్నర్ (Governor)చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. గవర్నర్ ప్రొటోకాల్ (Governor Protocal)రగడ ముదిరి పాకాన పడి దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్(Law And Order) చేయిదాటి పోతున్నట్లు హస్తినకు రిపోర్ట్ చేశారన్నది సమాచారం. ఇక.. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరుస ఆత్మహత్యలపై గవర్నర్ నివేదిక కోరడం సంచలనంగా మారింది. ఖమ్మం సాయి గణేశ్ (Khammam) ఆత్మహత్యకు కారణాలేంటి? రామాయంపేట తల్లి, కొడుకుల సూసైడ్‌కు దారితీసిన పరిస్థితులేంటి? భువనగిరి పరువు హత్యలో అసలేం జరిగింది? నల్గొండ గ్యాంగ్ రేప్ ఘటన వెలుగుచూడని కోణాలేంటి? ఇలా వరుస ఘటనలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై రిపోర్ట్ అడిగారు. తెలంగాణకు సంబంధించిన బిల్లులు గవర్నర్ పాస్ చేయకపోవడం, తెలంగాణను అన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
మెడికల్ సీట్ల (Medical Seats) దందాపై గవర్నర్ సీరియస్:
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో (Kaloji Health University)మెడికల్ సీట్ల (Medical Seats) దందాపై గవర్నర్ సీరియస్ అయ్యారు. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని కాళోజి యూనివర్సిటీ వీసీ(VC)ని ఆదేశించారు. రాష్ట్ర విద్యార్థులకు(Students) అన్యాయం జరగడంపై గవర్నర్ తమిళసై ఆందోళన వ్యక్తం చేశారు. తాను కూడా స్వయంగా డాక్టర్‌నే అని గుర్తుచేశారు. విద్యార్థులు నష్టపోకుండా చర్యలు(Actions) తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనిపై గవర్నర్ తమిళిసై రిపోర్ట్ (Report)అడిగారు. పూర్తిస్థాయి నివేదిక(Full Report) ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో.. మెడికల్ కాలేజీల (Medical College) విషయంలోనూ మంత్రి హరీష్‌రావు (Minister Harsih Rao) గవర్నర్ మధ్య ట్వీట్ వార్ (Twitter War) కొనసాగింది.
తెలంగాణ హైకోర్టు 6వ (6th High court Judge)ప్రధాన న్యాయమూర్తిగా:
జస్టిస్ అలోక్ నియామకంపై రాష్ట్రపతి (President) జారీచేసిన వారెంట్‌ను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుజన చదివి వినిపించారు.ఆ వారెంట్‌ను జస్టిస్ అలోక్‌కు గవర్నర్ అందజేశారు. తర్వాత తెలంగాణ హైకోర్టు 6వ(High court 6th) ప్రధాన న్యాయమూర్తిగా ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ అలోక్ (Justice Alok) కుటుంబసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అడ్వొకేట్ జనరల్ (Advocate General) బీఎస్ ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
27 మంది న్యాయమూర్తులు:
హైకోర్టులో ప్రస్తుతం సీజేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరింది. ఏపీ (Ap)నుంచి బదిలీపై వచ్చిన జస్టిస్ కన్నెగంటి లలిత (Kanneganti Lalitha) కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి జస్టిస్ సామ్ కోషీ తెలంగాణ హైకోర్టుకు బదిలీపై రానున్నారు. ఒకరు రావడం.. ఒకరు వెళ్లడం.. జరిగినా సంఖ్య మాత్రం 27గానే ఉంటుంది. ఇక కొత్తగా కొలీజియం సిఫారసులకు (Collegium recommendation) రాష్ట్రపతి ఆమోదం తెలిపితే ఈ సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ (Chance) ఉంది.