TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు!

తెలంగాణ 'మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు' స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌ బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ప్రక్రియ నిర్వహించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

New Update
TS Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్లు!

TS Govt Jobs:  తెలంగాణలో స్టాఫ్‌నర్స్‌ (Staff Nurse) ఉద్యోగాలకోసం పోటీపడుతున్న అభ్యర్థులకు 'మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు' (MHSRB) గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉద్యోగాల నియామకానికి అర్హత గల అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ (Certificate Verification) నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు హైదరాబాద్‌ (Hyderabad) బండ్లగూడలోని ఎక్సైజ్‌ అకాడమీ ప్రాంగణంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 6 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌ ఉంటుందని 'మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు' స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశామని, ప్రొవిజినల్‌ లిస్టును విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం అందించామని పేర్కొంది. ఇక 1:1.25 పద్ధతిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ చేస్తామని తెలిపిన అధికారులు.. అభ్యర్థులు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకాకపోయినా, నోటిఫికేషన్స్ లో పేర్కొన్న అన్ని పత్రాలను సమర్పించకపోతే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : స్టాఫ్‌నర్స్‌ ఉద్యోగాలకోసం పోటీపడుతున్న అభ్యర్థులకు 'మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు' (MHSRB) గుడ్ న్యూస్ చెప్పింది.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్‌నర్స్‌ పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా.. డిసెంబర్18న ఫలితాలు విడుదల చేసింది. అయితే వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మరో 1,890 పోస్టులను ప్రభుత్వం ఇందులో జతచేయగా మొత్తం పోస్టులు 7,094కు పెరిగడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు