Prajapalana Abhayahastham Application: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం పథకాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు. వార్డు, గ్రామ, మండల ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దరఖాస్తులను తీసుకుని, అప్లై చేస్తున్నారు ప్రజలు. అయితే, ఈ ప్రజాపాలన దరఖాస్తులపై ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తులో ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ బుక్ వివరాలను కోరిన ప్రభుత్వం.. బ్యాంకు వివరాలను మాత్రం అడగలేదు. దాంతో బ్యాంకు వివరాలు లేకుండా.. పెన్షన్లు, రైతు భరోసా, ఆర్థిక సాయం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు జనాలు.
పూర్తిగా చదవండి..Telangana: అభయహస్తం అప్లికేషన్‌పై అనేక సందేహాలు.. సమాధానం ఏది?!
తెలంగాణ అభయహస్తం అప్లికేషన్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు ఫామ్‌లో బ్యాంకు వివరాలు లేకుండా పెన్షన్లు, రైతు భరోసా, ఆర్థిక సాయం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు అర్హతలు ఎలా నిర్ధారిస్తారనేది ప్రశ్నగా మారింది.
Translate this News: