TS Govt : రైతులకు అదిరిపోయే వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt). తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. దీనివల్ల చాలా మంది రైతులకు ఆందోళన ఉండదని చెప్పవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటను చేసిందో తెలుసుకుందాం. అన్నదాతలు ఎక్కువగా వినియోగించే ఫర్టిలైజర్స్(Fertilizers) లో యూరియా ముందు వరుసలో ఉంటుంది. తెలంగాణ సర్కార్ తాజాగా ఈ ఫర్టిలైజర్ కు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేసింది. దీంతో రైతుల్లో ఉణ్న సందేహాలు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో యూరియా (Urea)కొరత ఉందని ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పదించింది. రాష్ట్రంలో యూరియా కొరత ప్రచారం అనేది పూర్తి అబద్ధమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)వెల్లడించారు.
వ్యవసాయశాఖతో సమీక్ష:
తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సెక్రేటేరియట్లో(Secretariat) వ్యవసాయ ప్రధాన కార్యదర్శి వ్యవసాయ శాఖ సంచాకులతో యూరియాపై సమీక్షించారు. రైతులకు కావాల్సిన ఎరువులు 4.67 లక్షల టన్నుల నిల్వ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అందువల్ల రైతులు, ప్రజాప్రతినిధులు, యూరియా, ఇతర ఎరువుల లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందవద్దని తుమ్మల పేర్కొన్నారు. అవసరం మేరకు ఎరువులను సరఫరా చేస్తున్నామని తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఈ ప్రకటనతో రైతుల్లో ఉన్న సందేహాలు తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.
రైతు బంధు స్కీం :
కాగా మరోవైపు రైతు బంధు స్కీం కింద అర్హత కలిగిన అన్నదాతలకు అందరికీ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. అయితు పలువురు రైతులు మాత్రం ఇంకా డబ్బులు రాలేదని..వీలైనంత త్వరగా విడుదల చేయాని కోరుకుంటున్నారు.
ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన:
అటు ఈనెల 26 తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం తొలిసభ నిర్వహించేలా ప్లాన్ రెడీ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి సభలో సీఎం పాల్గొన్నారు. ఈసారి పర్యటనలో ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్మ్రుతివనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు ఇంద్రవెల్లి అమర వీరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని ప్రకటించారు. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.