Telangana: ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన.. తన పదవికి రాజీనామా సమర్పించనున్నారు. గురువారం తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు రేవంత్.

Telangana: ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!
New Update

Telangana New CM Announcement: తెలంగాణలో కొత్త సీఎం ఎవరా అన్న ఉత్కంఠకు తెరదించింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డే తమ చీఫ్ మినిస్టర్ అభ్యర్థి అని ప్రకటించేసింది. టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్టు అధిష్ఠాన నిర్ణయాన్ని కేసీ వేణుగోపాల్.. ఢిల్లీలో మీడియా ముందు ప్రకటించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 7వ తేదీన అంటే గురువారం నాడు సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డితో పాటు.. కొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

ఆ పదవికి రాజీనామా..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. తెలంగాణకు వచ్చాక తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఉత్తమ్, కోమటిరెడ్డి కూడా..

తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఎమ్మెల్యేగా గెలుపొందడం.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుండటంతో వీరు కూడా తమ ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు. వీరికి కూడా మంత్రివర్గంలో కీలక పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Also Read:

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం

తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన ఫుల్ ప్రొఫైల్ ఇదే!

#cm-revanth-reddy #telangana-elections #congress-party #telangana-new-cm
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe