Ration Cards: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్.. రేపే లాస్ట్ !

రేషన్ కార్డుదారులకు తెలంగాణ సర్కార్ కీలక సూచన చేసింది. రేపటితో E KYC కి గడువు ముగియనునట్లు పేర్కొంది. రేషన్ కార్డుకు ఈ కేవైసీ చేయించుకోని వారు వెంటనే చేయించుకోవాలని సూచనలు చేసింది.

New Update
New Ration Cards : కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేసుకున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్ ...ఏంటో తెలుసా?

Ration Cards: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. రేషన్ కార్డు ఈ కేవైసీ పూర్తి చేయని వారు త్వరగా చేయాలని కోరింది. ఈ కేవైసీకీ జనవరి 31 వరకు గడువు ఉందని పేర్కొంది. ఆలోగా ఈ కేవైసీని పూర్తి చేయాలని రాష్ట్ర సర్కార్ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేషన్‌కు ఈ కేవైసీపీ పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 70శాతం ఈ కేవైసీ పూర్తి అయిందని అధికారులు చెబుతున్నారు. మిగతావాళ్లు కూడా కేవైసీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మీసేవ సెంటర్లలో రద్దీ భారీగా పెరిగింది. రేపటితో గడువు ముగియనుండడంతో మీసేవ సెంటర్ల వద్ద రేషన్ కార్డు ఈ కేవైసి కొరకు ప్రజలు జమ అవుతున్నారు. ఒకవైపు ప్రజాపాలన కార్యక్రమం కింద కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీల పథకాల కొరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరోవైపు రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియకు చివరి తేదీ కావడంతో ప్రజలు గందరగోళ స్థితిలో పడ్డారు. దరఖాస్తులు, ఈకేవైసీ ప్రక్రియకు గడుపు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. అయితే, ఆరు గ్యారెంటీల దరఖాస్తుల గడువు పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.

ALSO READ: త్వరలోనే మెగా డీఎస్సీ.. సీఎం రేవంత్ ఆదేశాలు

నేడు (ఆదివారం) రేపు నూతన సంవత్సరం కావడంతో దరఖాస్తుల స్వీకరణకు సెలవు ప్రకటించారు. 2నుంచి 6 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 6వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల కోసమే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ పథకాల లబ్ధిదారులు.. దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది. ప్రజలకు అవసరమైన సంఖ్యలో దరఖాస్తులు.. అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు.

ALSO READ: పెండింగ్ చలాన్లు.. ప్రభుత్వానికి లక్షల కోట్లు.. ఐదురోజుల్లోనే ఎంతంటే..

Advertisment
తాజా కథనాలు